Tissues
అర్థాలు
జిజ్ఞాస = కోరిక
జిజ్ఞాసి = కోరిక కలిగినవాడు /ఔత్సాహికుడు
అంతరిక్షం = ఆకాశం
అతిశయోక్తి = ఎక్కువచేసి చెప్పడం
ఏకాగ్రత = ఒకే విషయంపై మనస్సు లగ్నం చేయడం
స్వప్నం =కల
పర్యాయ పదాలు
కోరిక - ఇష్టం, అభిలాష, ఆకాంక్ష
విజయం - గెలుపు, జయం
ఆకాశం - గగనం, నింగి
మార్గం - దారి, బాట
బంగారం -కనకం, హేమం
మార్గదర్శి -స్ఫూర్తిప్రదాత, సహాయకారి
ఆసక్తి -ఆపేక్ష, అనురక్తి, ద్ధ
ఆశ - కోరిక, కాంక్ష, వాంఛ
ప్రకృతి -వికృతి
భూమి - బువి
ఆకాశం - ఆకసం
బంగారం - బృగారం
ఆశ్చర్యం - అచ్చెరువు
కష్టం - కస్తి
శాస్త్రం - చట్టం
ఉపాధ్యాయులు - ఒజ్జ
విద్య - విద్దె , విద్దియ
దిశ - దిస
వ్యతిరేక పదాలు
జయం x అపజయం
ఇష్టం x అయిష్టం
ఆశ x నిరాశ
విశ్వాసము x అవిశ్వాసం
విజ్ఞానం x అవిజ్ఞానం
ప్రయత్నం x అప్రయత్నం
ప్రశ్నలు – జవాబులు
1. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం గారి గురించి రాయండి.
అందరూ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం అని పిలిచే “డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దిన్ అబ్దుల్ కలాం” తమిళనాడు లోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టారు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జిజ్ఞాసతో ఇంజనీరుగా శాస్త్రవేత్తగా భారత రాష్ట్రపతిగా తన సేవలను అందించారు. ఒక విజేత ఆత్మకథ (ఇగ్నీటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ - యాన్ ఆటోబయోగ్రఫీ ) వంటి రచనలు చేశారు. శాస్త్రరంగంలో విశేష కృషి చేసినందుకు గాను ఆయనకు “పద్మభూషణ్” “ పద్మవిభూషణ్” పాటు అత్యున్నత పురస్కారం “ భారతరత్న” తోను మన భారతప్రభుత్వం ఆయనను సత్కరించింది. దేశ విదేశాలలోని అనేక విశ్వవిద్యాలయాలు ఆయనను ‘గౌరవడాక్టరేట్’ లతో సత్కరించాయి.
2. ‘ఇతరుల్ని అర్ధం సేసుకున్నవాడు విజ్ఞాని’ ఈ వాక్యం పై అభిప్రాయం రాయండి.
జ. ఇతరుల్ని అర్ధం చేసుకున్నవాడు విజ్ఞాని’ అనగా ఏ వ్యక్తి అయినా మొదట తనను తానే అర్ధం చేసుకోవాలి. అనగా తనను గురించి తాను తెలుసుకోవాలి. ఎవరైతే మొదట తనను గురించి తాను పూర్తిగా తెలుసుకోగలడో అటువంటివాడు ఇతరుల్ని అర్ధం చేసుకోగలడు. అనగా ఇతరుల మనోభావాలు బాగా చదివి విజ్ఞానం సంపాదించుకొగలడు. ఇతరుల్ని అర్ధం చేసుకున్నవాడు విజ్ఞాని అని చెప్పవచ్చు .
3. “కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడం” అనే మూడు అంశాల మీద ఎందుకు పట్టు సాధించాలి?
జ : జీవితంలో విజయం సాధించడానికి ఫలితాలు పొందడానికి మనం మూడు అంశాల మీద పట్టు సాధించాలి . వాటిలో మొదటిది “కోరిక”. రెండవది “నమ్మకం” ,మూడవది “ఆశపెట్టుకోవడం” . మనసులో ఏదో సాధించాలనే కోరిక మనకు ఏదైతే ఉందో అది సాధించాలని మనపై మనకు నమ్మకం ఉండాలి . ఆశ పెట్టుకోవడం అంటే మనలో పుట్టిన కోరికను ఆత్మవిశ్వాసంతో కృషి చేసి అది తప్పక జరిగి తీరుతుందని ప్రగాఢ విశ్వాసమును కలిగి వుండటం. దీని గురించి అబ్దుల్ కలాం వివరిస్తూ తన జీవితం ను౦డి ఒక ఉదాహరణ ఈవిధంగా ఇచ్చారు.
“నాకు ( కలాం) చిన్నప్పటినుండి ఆకాశపు రహస్యాలన్న, పక్షుల ప్రయాణమన్నా అమితాసక్తి . కొంగలు, సముద్రపు గువ్వలు ఎగురుతు౦డడం చూసి, నేను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణి. సాధారణ గ్రామీణ బాలుడిని అయినప్పటికి నేను కూడా ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలను అని ఎంతగా నమ్మానంటే మా రామేశ్వరం నుండి ఆకాశయానం చేసిన మొదటి బాలుడిని నేనే” అని గర్వంగా చెప్పారు కలాం.
4. నీ జీవితంలో మీ లక్ష్యం ఏమిటి? అది సాధించడానికి మీరు ఏమి చేస్తారు?
జ :నా లక్ష్యం ఒక ఉపాధ్యాయునిగా అవడం. చదువు మాత్రమే కాదు, సంగీత ఉపాధ్యాయుడిగా కూడా అవుతాను. అయితే దీని కోసం నేను చదువు, సంగీతం రెండూ బాగా నేర్చుకుంటాను. నేను నేర్చుకున్న విద్య పదిమందికి పంచుతాను. పేద పిల్లలకు ఉచితంగా నాకు తెలిసిన అంశాలను బోధిస్తాను.
5. ప్రొఫెసర్ “కలాంను”ముందు వరసలో కూర్చోమన్నారు కదా! కలాం స్థానంలో మీరుంటే ఎలా ఉండేవారు?
జ: కలాం గారి స్థానంలో నేను ఉంటే సిగ్గు పడకుండా గర్వo లేకుండా మ౦చి పేరు ప్రఖ్యాతలు పొందాలని ఇంకా కష్టపడతాను. గురువులు, పెద్దవారు సూచించిన మార్గంలో నడుచుకుంటాను.
6. కలాం తన ఆశయసాధనలో ఎలా కృతకృత్యుడు అయ్యాడు?
జ : కలాం తన ఆశయ సాధనలో ఎలా కృతకృత్యుడయ్యాడు అంటే! నమ్మకం, కోరిక, ఆశ పెట్టుకోవడంలో పట్టుదలగా ఉండి, ఏదన్నా సాధించాలని తను అనుకునే ముందు దాని మీద గట్టి నమ్మకంతో, క్రమ శిక్షణతో కృషి చేయడం వల్ల “కలాం” తన ఆశయసాధనలో కృతకృత్యుడయ్యాడు.
7. కలాం విద్యాభ్యాసం ఏవిధంగా కొనసాగిందో మీ సొంతమాటల్లో రాయండి.
జ : కలాం మొదట్లో రామనాథపురం హైస్కూల్లో చదివేటప్పుడు, “ఇయదురై సోలోమేన్” అనే ఉపాధ్యాయుడు ఆయనను తీర్చిదిద్దారు. ఇంటర్ మీడియట్ “సెయింట్ జోసెఫ్” అనే కళాశాలలో చదివారు.పరీక్షలను బట్టి చూస్తే ఆయన చురుకైన విద్యార్థి కాదు. కలాం భౌతిక శాస్త్రం పై ఆసక్తి కలిగి బీఎస్సీ డిగ్రీ చదివాడు. ఆయన కన్న కలలు, ఆశయాలు ఆకాశ విహారం. అది ఫలించాలంటే ఇంజనీరింగ్ చదవాలని గ్రహించాడు. ఆయన సోదరి “జోహారా” చేసిన ఆర్థిక సహాయంతో “మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో” ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ రోజుల్లో ప్రొఫెసర్లు అతనిని ఎంతగానో చైతన్యవంతుడిని చేశారు. ప్రొఫెసర్లు ఇచ్చిన ప్రాజెక్టు పని సమయానికి పూర్తి చేసి వారితో “శభాష్” అనిపించుకున్నారు.