Tissues
కవి – గుఱ్ఱం జాషువా
కాలం – 1895 – 1971
“ మాతలకు మాత సకల సంపత్సమేత” అంటూ భారతమాతను కీర్తించిన గొప్పకవి జాషువ. ఈయన రచనలు గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర వంటి అనేక రచనలు చేసారు. ఈయన రచన సరళ౦గా వుంటుంది . బిరుదులు: కవికోకిల, నవయుగ కవిచక్రవర్తి, కవితావిశారద, పద్మ భూషణ్, కళాప్రపూర్ణ, మధుర శ్రీనాథ మొదలైనవి .
సామాజిక సమస్యలను ఛేది౦చడానికి పద్యాన్ని ఆయుధంగా ఎంచుకున్న గొప్పకవి జాషువా.
అర్థాలు
1. చేతము =మనస్సు
2. ఇగురొత్తన్ (ఇగురు+ఒత్తన్) =చిగిరించేటట్లు
3. భయద సింహాలు = భయంకరమైన సింహాలు
4. మలచినాడవు = చెక్కినావు
5. వసుధ = భూమి
6. సర్వపర్వతములందు = అన్ని పర్వతాలలో
7. చిత్రములను =శిల్పాలను
8. చూచెదవు+ఒ(చూచెదవొ )=చూస్తావో
9. సార్థకము కాని = ప్రయోజనం లేని
10. పాషాణాలు = బండ రాళ్ళు
11. పెను = పెద్ద
12. రాతి కంబములను = రాతి స్తంభాలను
13. గున్నలు = ఏనుగు పిల్లలు
14. చాతుర్యము = నేర్పు
15. ప్రజ్ఞ = ప్రతిభ
16. సోగ కన్నులు = పొడవైన కన్నులు
17. చిరంజీవత్వము = శాశ్వతము
18. శిల్ప కంఠీరవా! = శిల్పులలో సింహం వంటివాడా!
19. చాతురి= నైపుణ్యం
20. అజంతా గహ్వర శ్రేణి = అజంతా గుహల సముదాయము
పర్యాయ పదాలు
1. రాతి - రాయి, బండ, పాషాణం
2. సింహం - మృగరాజు, సింగం
3. తల - శిరం, మస్తిష్కం
4. పర్వతం - గిరి, అద్రి
5. దేవస్థలం - దేవాలయం, గుడి, కోవెల
6. కుసుమం - పుష్పం, పువ్వు, సుమం
7. చాతుర్యం - తెలివి, నైపుణ్యం, ప్రతిభ
8. లేమి - కరువు, పేదరికం
9. విద్య - చదువు, పాండిత్యం
10. నిధి - డబ్బు, సిరి, సంపద, ధనం
11.పడతి - స్త్రీ, మహిళ, ఇంతి
12.ప్రతిమలు - బొమ్మలు, విగ్రహాలు
13.తారతమ్యం - బేధం, తేడా, వ్యత్యాసం
14.అబద్ధం - కల్ల, అసత్యం
ప్రకృతి -వికృతి
1. కావ్యం - కబ్బ౦
2. విద్య - విద్దె
3. కథ - కత
4. అద్బుతం - అబ్బురం
5. ఆశ్చర్యం - అచ్చెరువు
6. సింహం - సింగం
7. దేవాలయం - దేవల౦
8. స్థలం - తలం
9. కవిత - కైత
10. ముఖం - మొగం
11. స్త్రీ - ఇంతి
12. ప్రజ్ఞ - పగ్గె
13. చిత్రం - చిత్తరువు
14. సంతోషం - సంతసం
15. రాజు - రేడు
16. చరిత్ర - చరిత
17. భేదం - బేదం
18. గృహం - గీము
19. పుణ్యం - పున్నెం
20. ప్రాణం - పనం
21. స్థంబ౦ - కంబం
22. శక్తి - సత్తి
23. నిద్ర - నిదుర
వ్యతిరేక పదాలు
1. నింగి X నేల
2. భూమి X ఆకాశం
3. కలదు X లేదు
4. కలిమి X లేమి
5. సున్నిత౦ X కఠినం
6. నునువు X గరుకు
7. తడి X పొడి
8. సోయగం X వికారం
9. సంతోషం X విచారం
10. తారతమ్యం X సమానం
11. అబద్ధం X నిజం
12. బయట X లోపల
13. జీవం X నిర్జీవం
14. జ్ఞానం X అజ్ఞానం
15. ఆసక్తి X అనాసక్తి
16. శాశ్వతం X ఆశాశ్వతం
17. పుణ్యం X పాపం
18. మానవులు X దానవులు
19. దరిద్రం X ఐశ్వర్యం
ప్రశ్నలు – జవాబులు
1. శిల్పి రాళ్ళల్లో ఏయే రూపాలను చూసి ఉంటాడు?
జ:శిల్పి రాళ్ళల్లో అనేక రూపాలను చూసి ఉంటాడు. అవేంటంటే దేవుళ్ళు, దేవతల రూపాలు అందమైన స్త్రీలు, పూలు, లేత తీగలు, ఏనుగులు, మహారాజుల రూపాలు, అప్సరసలు అనేక మానవుల రూపాలను చూశాడు. ఇలా ఇంకా అనేక రూపాలతో నగరాలు కూడా రాళ్లతో నిర్మించిన గొప్ప కళాకారుడు శిల్పి.
2. నల్లని రాళ్లకు శిల్పి మీద కృతజ్ఞత ఎందుకు ఉండాలి?
జ:నల్లని రాళ్ళు శిల్పికి కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే శిల్పి ఆ రాతిని అందమైన విగ్రహంగా మలచక పొతే అది పనికిరాని బండ గానే ఉండేది. ఆ నల్ల రాయికి పసుపు కుంకుమలతో పూజలు దక్కేవి కాదు. అందుకే నల్లని రాళ్ళు శిల్పి మీద కృతజ్ఞతలు కలిగి వుండాలి.
3. కవికి శిల్పికి ఉండే పోలికలు భేదాలు ఏమిటి?
జ:కవికి శిల్పికి చాలా పోలికలు ఉన్నాయి. అవి కవి కవిత్వాన్ని తన కలం తో రాసి మనకు అందిస్తారు. శిల్పి ఉలితో రాళ్ళపై విగ్రహాలను చెక్కి ఎందరో రాజుల చరిత్రలు ఎన్నో కావ్యాలు మనకు అందిస్తారు.
కవికి శిల్పికి భేదం లేదు ఎందుకంటే తను చెప్పదలుచుకున్న విషయాన్ని తన మనసులోని భావాలను కవి కావ్యం ద్వారా చెబుతారు. శిల్పి తన బొమ్మల ద్వారా చెబుతాడు. అందుకే కవికి శిల్పికి భేదం లేదు.
4) చూసేవాళ్ళకు శిల్పాలు మహారాజుల కథలు చెప్పగలవని కవి ఎందుకు అన్నాడు?
జ: మహారాజుల చరిత్రను శిల్పములుగా చెక్కితే వాటిని చూసే వారికి ఆ మహారాజు చరిత్ర తెలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు కాకతీయ రాజుల వంటి వారి శిల్పాలు చూపరులను వారి చరిత్రను గుర్తుకు తెస్తాయి. అందువల్ల చూసేవారికి శిల్పాలు రాజుల కథలు చెప్పగలవని కవి అన్నాడు. ఇలా తరతరాలకు చరిత్రను తెలియచేసే శిల్పాలను చెక్కిన శిల్పి గొప్పవాడు.
5) శిల్పి గొప్పతనాన్ని వివరిస్తూ సొంతమాటల్లో రాయండి.
జ: శిల్పి చిరంజీవి. అతడు చెక్కిన శిల్పాలు జీవకళతో నేటికీ నిలిచి ఉన్నాయి. అతడు సింహాల శిల్పాలు చెక్కితే అవి నిజమైన సింహాలేమో అనే భ్రాంతిని కలిగిస్తాయి. పూర్వం మహారాజులు శిల్పకళను పోషించారు. ఎన్నో దేవాలయాలను కట్టించారు. ఈ శిల్పకళ లలో ఒక్కొక్క రాజులు ఒక్కొక్క మార్గాన్ని అనుసరించారు. ప్రభుత్వ౦ శిల్ప కళకు ప్రోత్సాహం ఇవ్వాలి . పూర్వులు చెక్కిన శిల్పాలను రక్షించాలి.
6. కవి శిల్పిని శాశ్వతుడని, ఆయన ప్రజ్ఞకు నమస్కారం చేయుమని చెప్పాడు కదా! దీనిమీద మీ అభిప్రాయాన్ని చెప్పండి.
జ: ‘శిల్పి’ ఎప్పుడూ శాశ్వతమైనవాడు. అంటే శిల్పి తాను చెక్కిన శిల్పాలు ఉన్నంతకాలం, ప్రజలు అతడిని గుర్తు చేసుకుంటారు. అతని శిల్పకళాచాతుర్యానికి మెచ్చుకొని జోహార్లు సమర్పిస్తారు. అందువల్ల శిల్పి ఎప్పుడు శాశ్వతుడు. గొప్పగా శిల్పని చెక్కిన శిల్పికి మనము ఈయగలిగిన కానుక ఏముంటుంది? తలవంచి మనం ఆయన శిల్పకళా గొప్పతనానికి నమస్కారము చేయడము తప్ప!
7. శిల్పకళ వలే నీకు తెలిసిన ఇతర కళలేవి? ఆయా కళాకారుల గొప్పదనమేమిటి?
జ: శిల్పకళ వలే నాకు తెలిసిన ఇతర కళలు చాలా ఉన్నాయి. కవిత్వం, చిత్రకళ, నాట్యకళ, వాద్య సంగీతం, గాత్ర సంగీతం వంటివి కూడా కళలే. ఆయా కళాకారులు తాము నేర్చుకున్న కళలను ఎంతో నైపుణ్యంతో ప్రదర్శించి అందరి మన్ననలు పొందుతారు.
8. ప్రఖ్యాతిగాంచిన శిల్ప కళా ఖండాలు గల ప్రదేశాలు ఏమిటి?
జ: గోల్కొండకోట, వేయిస్తంభాలగుడి, ఎల్లోరా శిల్పాలు,రామప్పగుడి, ఏకశిలారథం మెదలైనవి.