Latest News Details

Lot of mistakes in TSPSC group 4 exam question paper

Published on Oct 8 2018 | Updated on Oct 8 2018
Lot of mistakes in TSPSC group 4 exam question paper
గ్రూప్- 4 పరీక్ష గందరగోళంగా జరిగింది. దీంతో ఆదివారం పరీక్ష రాసిన అభ్యర్థులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. పేపర్-1 సెట్ బీ లోని ప్రశ్నలు సెట్ ఏలో కనిపించాయి. ప్రశ్నపత్రం లో తలెత్తిన తప్పుల వల్ల పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. పేపర్- 1 పరీక్షలో ఏ సిరీస్ ప్రశ్నపత్రంలో విద్యార్థులకు కొన్ని పేజీలు మిస్సయ్యాయి. మరోవైపు బీ సిరీస్ నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా కొన్ని రిపీట్ అయ్యాయనీ విద్యార్థులు ఆరోపించారు.
ఏ సిరీస్ ప్రశ్నపత్రంలో బీ సిరీస్ కు చెందిన 16, 17, 18, 19, 20, 21, 45, 46, 63,64,65,73,74,75,90,91,92,93,100,101,119,120,121,122,123,124 తదితర ప్రశ్నలు ఒక సిరీస్ కు బదులు మరో సిరీస్ లో వచ్చాయి. ఏ సిరీస్, బీ సిరీస్ రెండూ ఒకే ప్రశ్నపత్రంలో ఉన్నందున పరీక్ష సరిగా రాయలేకపోయామని అభ్యర్థులు ఆరోపించారు.
అయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ ప్రశ్నలు వచ్చాయి. దీంతో విషయాన్ని కమిషన్ (టీఎస్ పీఎస్సీ) మాత్రం కొన్ని పొరపాట్లు దొర్లినందున అందుబాటులో ఉన్న మరో పేపర్ ఇచ్చి పరీక్ష రాయించామని, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నిర్వహించామని తెలిపింది. ఇదిలా హైదరాబాద్ ఈసీఐఎల్లోని శ్రీచైతన్య కళాశాలలో గ్రూప్- 4 పరీక్షలు రాస్తున్న ఆరుగురు అభ్యర్థులకు ఏ-1 సిరీస్ ప్రశ్నపత్రంలో బీ సిరీస్ ప్రశ్నలు వచ్చాయి. దీంతో విషయాన్నిఇన్విజిలేటర్లకు చెప్పగా వారు టీఎస్ పీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు.
ఒక దశలో అభ్యర్థులు టీఎస్ పీఎస్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ బందోబస్తు మధ్య పరీక్షలు పూర్తయినప్పటికీ తమకు న్యాయం చేయాలని ఆరుగురు అభ్యర్థులు టీఎస్ పీఎస్సీని కోరారు.

MORE IN THIS SECTION