Latest News Details

Big Update for JEE Main 2024 Applicants

Published on Dec 1 2023 | Updated on Dec 1 2023
Big Update for JEE Main 2024 Applicants
NTA has released a significant update for those applying to JEE Main. The deadline for submitting applications for JEE Main 2024, the prominent engineering entrance exam for admission to leading educational institutions in the country, has been extended. The last date for the submission of applications for the JEE Main final attempt, scheduled to take place in January, has been extended until 9:00 PM on December 4. This information was disclosed in a public statement. Additionally, it was mentioned that the fee payment deadline has been extended until 11:50 PM on the same day. For those who need to make corrections or modifications in their applications, the opportunity has been provided from December 6 to 8. Applicants are advised to check the https://jeemain.nta.nic.in website for complete updates. NTA has already announced that the JEE Main Session-1 exams will be conducted between January 24 and February 1, as revealed earlier.

JEE Main 2024: జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసేవారికి బిగ్‌ అప్‌డేట్‌
జేఈఈ మెయిన్‌  దరఖాస్తుల గడువును ఎన్‌టీఏ పొడిగించింది.  ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

JEE Main 2024 Applications| దిల్లీ: దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌-2024 (JEE main 2024) ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఎన్‌టీఏ గడువు పొడిగించింది. జనవరిలో జరిగే జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షకు దరఖాస్తుల తుది గడువు నేటితో (నవంబర్‌ 30) ముగియడంతో.. ఆ గడువును డిసెంబర్‌ 4 రాత్రి 9గంటల వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అలాగే, అదే రోజు రాత్రి 11.50గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది.

దరఖాస్తుల్లో ఏవైనా సవరణలు చేయాల్సి వస్తే డిసెంబర్‌ 6 నుంచి 8వరకు అవకాశం కల్పించింది.  పూర్తి అప్‌డేట్స్‌ కోసం అభ్యర్థులు https://jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని సూచించింది. JEE Main సెషన్‌-1 పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య తేదీల్లో జరుగుతాయని ఇది వరకే NTA ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి దేశవ్యాప్తంగా దాదాపు 8.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చని అంచనా. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.50 లక్షల మంది దరఖాస్తు చేసే అవకాశం ఉంది. (జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 సిలబస్‌ కోసం క్లిక్‌ చేయండి)

ఇలా అప్లై చేసుకోండి
Jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవ్వండి
సెషన్‌-1 రిజిస్ట్రేషన్‌ లింక్‌పై క్లిక్‌ చేయండి
రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి ఆ తర్వాత అప్లికేషన్‌ ఫారం ఫిల్‌ చేసేందుకు లాగిన్‌ అవ్వండి.
అవసరమైన సమాచారాన్ని ఎంటర్‌ చేసి, డాక్యుమెంట్‌లను అప్‌లోడ్‌ చేయండి. ఫీజు చెల్లింపు పూర్తి చేయండి.
ఆ తర్వాత మీ ఫారమ్‌ను సబ్‌మిట్‌ చేసి కన్ఫర్మేషన్‌ పేజీని సేవ్‌ చేసిపెట్టుకోండి.

MORE IN THIS SECTION