Latest News Details

A.P. Govt planning Another TET!

Published on Jul 31 2018 | Updated on Jul 31 2018
A.P. Govt planning Another TET!
రాష్ట్రంలో మెగా డీఎస్సీ కోసం పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. దీని ద్వారా దాదాపు20వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు నిజంగా ఇది మంచి శుభవార్తెనని చెప్పొచ్చు. ఈమేరకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తేలి సింది. తొలుత డీఎస్సీలో 10,351 ఉపాధ్యాయ పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించింది.
అయితే ఇప్పటికే డీఎస్సీ మరింత ఆలస్యంకావడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ ఖాళీ పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరగడంతో ప్రభుత్వం ఈ మెగా డీఎస్సీ నిర్వహణకు మొగ్గు చూపిస్తుందంటున్నారు. బీఈడీ అభ్యర్థులకు డీఎస్సీ ఎస్జీటీ పోస్టుల్లో అవకాశం కల్పించాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తొలుత బీఈడీ అభ్యర్థులకు ప్రత్యే కించి, టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఆ ఆలోచనను విరమించుకున్నారు. బీఈడీ అభ్యర్థులకు మూడవ టెట్ నిర్వహించి, వీరికి మెగా డీఎస్సీలో అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు బీఈడీ అభ్యర్థులకు మూడవ విడత టెట్ నిర్వహణకు ప్రతిపాదనలు కూడా విద్యాశాఖ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పటివరకు బీఈడీ అభ్యర్థుల విషయంలో తలెత్తిన వివాదానికి తెరపడినట్లేనని అంటున్నారు.
కాగా ఎంతోకాలంగా బీఈడీ అభ్యర్థులు తమకు కూడా ఎస్జీటీ పోస్టులకు అవకాశం కల్పించాలని పోరాడుతున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో వారికి ఒకింత ఊరట కలిగిందని చెప్పవచ్చు కాగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీని రెండు విడతలుగా వాయిదా వేస్తూ వచ్చింది. ఇదిగో అదిగో అంటూనే ప్రభుత్వం మళ్లీమెగా డీఎస్సీ వైపు మొగ్గుచూపిస్తుండడంతో అభ్యర్థుల్లో ఒకింత ఆందోళన, మరో వైపు ఆనందం . వ్యక్తమవుతున్నది. ఆర్థిక శాఖ నుంచి తీసుకోవాల్సిన అనుమతుల ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని మంత్రి విద్యాశాఖను ఆదేశించినట్లు తెలిసింది. మొత్తం 20వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే మెగా డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందంటున్నారు.

MORE IN THIS SECTION