Latest News Details

11 BC Category junior colleges starts in Andhra Pradesh

Published on Jul 25 2018 | Updated on Jul 25 2018
11 BC Category junior colleges starts in Andhra Pradesh
మహాత్మా జ్యోతిబాపూలే రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో 11 బీసీ జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11 కళా శాలల్లో సింహాచలం, మోపిదేవి, కోట, దొరవారి సత్రం, లేపాక్షి ప్రాంతాల్లో ఐదు బాలల కళాశాలలు, నెల్లిమర్ల, తానం, టేకులోడు, నందలూరు, ఆరేకల్‌, నెరవాడల్లో ఆరు బాలికల కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ కళా శాలల్లో జూనియర్‌ ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులతో తరగ తులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. వెనుకబడిన తరగతుల విద్యార్థినీవిద్యార్థుల కోసం బీసీ గురుకుల సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే 41 పాఠశాలలు, రెండు జూని యర్‌ కళాశాలలు పని చేస్తున్నాయన్నారు.

MORE IN THIS SECTION